Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, April 30, 2013

2 పేతురు 2వ అధ్యాయము

1. మరియు అబద్ధపవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధబోధకులుందురు; వీరు తమమును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
2. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడతురు; వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును.
3. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీ వలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్ర పోదు.
4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.
5. మరియు ఆయన పూర్వకాలమందున్నలోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
6. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మము చేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,
7. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
8. ఆ నీతిమంతుడు  వారి  మధ్యను కాపురముండి, తాను  చూచినవాటిని బట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.
9. భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ  కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు. 
11. దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు. 
12. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని  విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,
13. ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు.వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు. 
14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి,
15. తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. 
16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రెమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరు లెని గార్దభము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. 
17. వీరు నీ్ళ్ళు లేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది. 
18. వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తమే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు. 
19. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా.
20. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవజ్ఞానముచేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటె మరి చెడ్డదగును. 
21. వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. 
22. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను. 
      Download Audio File

No comments:

Post a Comment