Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, April 30, 2013

2 పేతురు 1వ అధ్యాయము


1.యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
2. తన మహిమను బట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక.
4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.
5. ఆ హేతువుచేతనే మీ మట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసము నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ణానమును,
6. జ్ణానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహము నందు సహనమును, సహనము నందు భక్తిని,
7. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి.
8. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.
9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.
10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. 
11. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్ట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.
12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. 
13. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని యెరిగి,
14. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
15. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసికొనునట్లు జాగ్రత్త చేతును.
16. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని
17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా
18. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.
19. మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు.
20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి.
       Download Audio File

No comments:

Post a Comment